ముగించు

టి ఎస్ ఎస్ పి డి సి ఎల్

సంస్థ ప్రొఫైల్:

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించి హబ్సిగూడ సర్కిల్ లో 7 మండలాల్లో, 3 ఆపరేషన్ డివిజన్లు, 8 ఆపరేషన్ సబ్-డివిజన్లు మరియు 26 ఆపరేషన్ సెక్షన్లు ఉన్నాయి.   

 • విద్యుత్ ఉప కేంద్రములు
 • 33/11 KV             – 55 Nos.
 • 132/33 KV             – 1 No.
 • 220/132 KV                 – 3 Nos.
 • మౌలిక సదుపాయాలు
 • 33 KV విద్యుత్ లైన్                                 – 48
 • 11 KV విద్యుత్ లైన్                                 – 336
 • పవర్ నియంత్రికలు                 – 114 Nos.
 • పంపిణీ నియంత్రికలు                                 – 11788 Nos.
 • విద్యుత్ వినియోగదారులు
 • గృహములకు                                 – 681169
 • పారిశ్రామిక                 –  5961 Nos.
 • వ్యవసాయ                 – 6885
 • ఇతరులు                 –  91335
 •                          –  785350.

హబ్సిగూడ సర్కిల్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిగిన అభివృద్ధి:

పల్లె ప్రగతి ప్రోగ్రాం Ph-IV:పల్లె ప్రగతి ప్రోగ్రాం Ph-IV  హబ్సిగూడ సర్కిల్ నందు 1కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేయడం జరిగింది.

పట్టణ ప్రగతి ప్రోగ్రాం Ph-III:పట్టణ ప్రగతి ప్రోగ్రాం Ph-III నందు కొత్తగా ఏర్పడిన 7 మున్సిపాలిటీ ల లో హబ్సిగూడ సర్కిల్ నందు 3.45కోట్ల వ్యయంతో పనులు  పూర్తి చేయడం జరిగింది.

33/11 KV విద్యుత్ ఉప కేంద్రములు: (T&D అభివృద్ధి కార్యక్రమమునందు) :

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం నందు రూ. 4.45 కోట్లతో నిర్మాణం చేపట్టిన 33/11KV  విద్యుత్ ఉప కేంద్రముల వివరాలు

33/11 KV విద్యుత్ ఉప కేంద్రం – కొండపూర్ (V), ఘట్ కేసర్ మండలం

11KV విద్యుత్ తీగలు లాగడం: (T&D అభివృద్ధి కార్యక్రమమునందు):

నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ పంపిణీ చేయడం కోసం 105 కి. మీల 11KV  విద్యుత్ తీగలను రూ. 3.86 కోట్ల వ్యయంతో లాగడం జరిగింది.                

విద్యుత్ పంపిణీ నియంత్రికలు : (T&D అభివృద్ధి కార్యక్రమమునందు)

      రూ. 10.63 కోట్ల వ్యయంతో కొత్త 370 Nos. విద్యుత్ పంపిణీ నియంత్రికలు మరియు  పాతవాటి సామర్థ్యము పెంచడం జరిగింది.

వ్యవసాయ మరియు ఇతర విద్యుత్ కనెక్షన్లు :

316Nos వ్యవసాయ పంపు సెట్లకు రూ. 221.2 లక్షల వ్యయంతో విద్యుత్ కనెక్షన్లు మరియు 89155 కనెక్షన్లు గృహాలకు, వాణిజ్య మరియు పరిశ్రమలకు విద్యుత్తు ఇవ్వడం జరిగింది.

 LT విద్యుత్ తీగలు లాగడం:

నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ పంపిణీ చేయడం కోసం 102.5 కి. మీల LT  విద్యుత్ తీగలను రూ. 3.05 కోట్ల వ్యయంతో లాగడం జరిగింది.

 11 KV విద్యుత్ తీగలు & పంపిణీ నియంత్రికలు మరమ్మత్తు పనులు చేయుట:

75Nos. 11 KV విద్యుత్ తీగలను మరియు 450 Nos. పంపిణీ నియంత్రికలు మరమ్మత్తు పనులు చేయడం జరిగింది.

విపత్తుల నిర్వహణ :

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు, విద్యుత్ అంతరాయములను తగ్గించుట కోసం సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆపరేషన్ కొ-ఆర్డినేటర్ గా, డివిజనల్ ఇంజినీర్/టెక్నికల్ నోడల్ అధికారిగా, డివిజనల్ ఇంజినీర్/కన్ స్ట్రక్షన్, డివిజనల్ ఇంజినీర్/ఎం.ఆర్.టి మరియు డివిజనల్ ఇంజినీర్/డి.పి.ఈ లు విపత్తుల నిర్వహణ చేయటం కోసం కమిటీ వేయడం జరిగింది.  విపత్తులను ఎదుర్కొనుటకు ఒక కాంట్రాక్టరు, ఒక వెహికల్ మరియు స్కిల్డ్ కార్మికులతో 3 బృందాలుగా ఏర్పాటు చేయడం మరియు 24 గంటలకు కంట్రోల్ రూమ్ సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు నిరంతరాయ విద్యుత్ పంపిణీ అన్నీ రకాల విద్యుత్ వినియోగదారులకు ఇవ్వడం జరిగింది.