శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని తమకు అప్పగించిన విధులను ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా నిర్వహించి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ గౌతం పోట్రు ఐఏఎస్. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై
పత్రిక ప్రకటన–4 తేదీ : 28–11–2023
=========================================
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఈ విషయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, నోడల్ అధికారులతో మీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఈ నెల 28-11-2023 సాయంత్రం 5 గంటల నుంచి, 30 -11-2023 రోజు పోలింగ్ పూర్తి అయ్యే వరకు, 48 గంటలు జిల్లా లో పకడ్బందీ గా 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు .144 సెక్షన్ అమలులో ఎలాంటి సభలు , సమావేశాలు నిర్వహించరాదు, గుంపులు గుంపులు గా ప్రజలు ఉండకూడదు , 5 గురు వ్యక్తుల కంటే మించి ఉండరాదని, డోర్ టు డోర్ ప్రచారం చేయరాదని తెలిపారు. పోలింగ్ రోజు పోలింగ్ సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, మాక్ పోల్ ఉదయం 5.30 కి నిర్వహించాలని, పోలింగ్ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించాలని, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని, జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈ.వి.ఎం. యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రం పరిధిలోని సెక్టార్ అధికారితో సమన్వయంతో ఉండాలని తెలిపారు. పోలింగ్ రోజున ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతంపై ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని, పోలింగ్ ప్రక్రియ పై ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవిఎం యంత్రాల తరలింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలనీ అన్నారు