బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్లు, వివి పాట్‌లు, సప్లిమెంటరీ రాండమైజేషన్ పూర్తయింది, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
పత్రిక ప్రకటన–2 తేదీ : 24–11–2023
=================================
రిజర్వ్ లో ఉన్న బ్యాలట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ల, వి వి పాట్ లు, సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పూర్తి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వ్ లో ఉన్న బ్యాలట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ కట్టు దిట్టంగా పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపినారు .
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, గుర్తిపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వ్ బ్యాలట్ యూనిట్లు,47 కంట్రోల్ యూనిట్లు,155, వి వి పాట్ లు,20, సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్,మాట్లాడుతూ, వాస్తవానికి ఇప్పటికే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంల తరలింపు పూర్తయ్యింది. అయితే పోలింగ్ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా ఓటింగ్ కు అంతరాయం ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతో అదనపు బ్యాలట్ యూనిట్ కంట్రోల్ యూనిట్లను కేటాయించడం జరుగుతోందని ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా రిజర్వ్ లో వున్నా బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ల, వి వి పాట్ లు, ర్యాండమైజేషన్ ప్రక్రియ గుర్తిపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా చేపట్టినట్లు తెలిపారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బ్యాలట్ యూనిట్లు, 15, కంట్రోల్ యూనిట్లు,30, మల్కజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బ్యాలట్ యూనిట్లు,10, కంట్రోల్ యూనిట్లు, 30, వి వి పాట్ లు, 10, కూకట్ పల్లి, అసెంబ్లీ నియోజకవర్గానికి బ్యాలట్ యూనిట్లు,10, కంట్రోల్ యూనిట్లు, 30, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బ్యాలట్ యూనిట్లు,02 కంట్రోల్ యూనిట్లు 35, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బ్యాలట్ యూనిట్లు,10, కంట్రోల్ యూనిట్లు 30, వి వి పాట్ లు, 10, ర్యాండమైజేషన్ ప్రక్రియతో కేటాయించా మని అన్నారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఏ ఈవిఎం యంత్రం ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో వెళ్తుందో ఆన్ లైన్ ఎన్నికల కమిషన్ రూపొందించిన సాఫ్ట్ వేర్ మాత్రమే నిర్దేశిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎం యంత్రాన్ని ఇతరులు కంట్రోల్ చేయడం కుదరదని తెలిపారు.