ముగించు

పైగా రూ. జిల్లాలో 58 కోట్ల 48 లక్షల నగదు స్వాధీనం, రూ. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా 43 కోట్ల నగదు తిరిగి, జిల్లా వ్యాప్తంగా 482 కేసులు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,,

26/11/2023 - 07/12/2023

Shri.Gautham Potru IAS.,

పత్రిక ప్రకటన–1                      తేదీ : 25–11–2023
=================================
జిల్లాలో రూ.58.కోట్లు 48 లక్షలు కు పైగా నగదు స్వాధీనం,
జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.43 కోట్ల నగదు తిరిగి అప్పగింత,
జిల్లా వ్యాప్తము గా 482, కేసులు ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, తెలిపారు,  ఈ సందర్భంగా ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు జిల్లా లో తనిఖీలలో ఇప్పటి వరకు జప్తు చేసిన (నగదు ,ఆభరణాలు, బంగారం మొత్తము విలువ  )  58, కోట్లు 48 లక్షల 62 వేల 662 రూపాయల్లో,  స్వాధీనం చేసుకొని అలాగే ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఆధ్వర్యంలో రెండు లక్షల పది హేడు వేల డెబై మూడు ( 2,17,073)   లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 1,114 కేసులు నమోదు 487 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని… చేసినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్న  43 కోట్లు రూపాయలు  నగదు తిరిగి అప్పగింత,
ఈ మేరకు జిల్లా వ్యాప్తము గా 482, కేసులు ,నమోదు చేయగా  జిల్లా  గ్రీవెన్స్ కమిటీ అధికారులు అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించి అన్ని రకాల ఆధారాలు సరిగ్గా ఉన్న కేసులకు సంబంధించి 396 కేసులకు సంబంధించి 43 కోట్లు రూపాయలు తిరిగి అప్పగించినట్లు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్ళరాదని. ఒకవేళ తీసుకువెళ్ళేట్లయితే అందుకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని లేనట్లయితే  నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, మద్యం తరలింపుపై నిరంతరం పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా నిఘా కొనసాగుతుందని..ఈ విషయంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు.  అలాగే పట్టుకొన్న నగదును అన్ని రకాల రశీదులు, తగిన సాక్ష్యాలతో తిరిగి తీసుకొనేందుకు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఎఫ్–12లో గ్రీవెన్స్ కమిటీ లో సంప్ర దించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.