ముగించు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు పేదరికం నుండి బయటపడటానికి మరియు జీవనోపాదులు పెంపొందించుటకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్రింది ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అమలు చేయ బడుచున్నవి.

ఆసరా పెన్షన్లు: ఈ పథకం కింద ప్రతి నెలా ఈ క్రింది 7 రకాల పెన్షన్లకు సంబంధించి వృద్దాప్య, వితంతు, చేనేత కార్మికులు,ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు ఒక్కక్క పెన్షనర్‌కు రూ .2,016/- మరియు వికలాంగులకు ఒక్కక్క పెన్షనర్‌కు రూ. 3,016/- పంపిణీ చేయడం జరుగుచున్నధి. జిల్లాలోని మొత్తం అర్హత గల పెన్షనర్లు 1,04,008 మరియు వీరికి పెన్షన్ల చెల్లింపు కొరకు, ప్రతి నెల రూ. 23.62 కోట్లు పంపిణీ చేయడం జరుగుచున్నధి.

సదరం : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో సదరం క్యాంపులు 1 జనవరి 2020 నుండి దివ్యాంగులకు మీ-సేవా స్లాట్ బుకింగ్ ద్వారా మల్కాజ్‌గిరి జిల్లా ఆసుపత్రిలో  నిర్వహించ బడుచున్నాయి. క్యాంపుకు వచ్చిన దివ్యాంగులకు సదరం  సర్టిఫికేట్  3 నుండి 4 పని ధినములలో జారీ చేయబడుతుంది.

బ్యాంక్ లింకేజ్ (బిఎల్): 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2621 స్వయం సహాయక సంఘాలకు 106.21 కోట్ల లక్ష్యమునకు, 1837 స్వయం సహాయక సంఘాలకు రూ. 90.19 కోట్ల అందజేయడం జరిగినది.  ఇప్పటి వరకు 85% ప్రగతి సాధించడం జరిగింది.

స్త్రీనిధి : 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3655 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 72.28 కోట్ల లక్ష్యంతో ఇప్పటి వరకు 23.43 కోట్లు పంపిణి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 93% ప్రగతి సాధించడం జరిగింది.

 సంస్థాగత నిర్మాణము : సంఘాల సామర్థ్యాలను పెంపొందించడానికి సంస్థాగత నిర్మాణములో భాగంగా, స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం వివిధ వ్యూహాలు, పొదుపులు, అంతర్గత రుణాల కోసం స్వయం సహాయక సంఘ సభ్యులకు వివిధ స్థాయిలలో శిక్షణలను నిర్వహించటం జరుగుచున్నది. జిల్లా మహిళా సమాఖ్య పరిధిలొ 5 మండల మహిళా సమాఖ్యలు,  118 గ్రామ సంఘాలు, 3355 స్వయం సహాయక సంఘాలు మరియు 35,376 మంది సభ్యులు వున్నారు.

మానవాభివృద్ది (హెచ్‌డి): స్వయం సహాయక సంఘాల సభ్యులకు ( మహిళల్లో ఆరోగ్యం, పోషకాహారం, పారిశుధ్యం, విద్య) ఆరొగ్యమే మహాభాగ్యము అనే నినాదంతో అహారంతో ఆరోగ్యం, పోషకాలు నష్టపోకుండా వంట చేసే పద్డతులు, పిల్లల పోషణ –  రోజుల ప్రాముఖ్యత, పిల్లల ఫీడింగ్ పద్దతులు, చేతుల పరిశుభ్రత, సురక్షితమైన మరియు సమత్యుల ఆహారం, వ్యర్ధ పదార్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిశుభ్రత అను 8 అంశాలపై స్వయం సహాయక సంఘాలలో ద్వితీయ సమావేశములు నిర్వహించడం జరుగుతుంది.  

నాన్ –ఫామ్: 2020-21 సంవత్సరములో  Covid-19  నివరణకు సంబంధించి  మాస్క్ల తయారి నిమిత్తం, 5 మండల మహిళా సమాఖ్యలకు   మొత్తం రూ// 10,00,000/- మంజురి చేయడం జరిగినది.

 పుడ్ ప్రోసెసింగ్ :   2020-21 సంవత్సరములో పుడ్ ప్రోసెసింగ్  కార్యక్రమం లో భాగం 198 చిన్నతరహ మార్కెటింగ్ కార్యక్రమాలను గుర్తించడం జరిగింది.

 మహత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకం (MGNREGS): మహత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకం ద్వారా 100 రోజుల పనిని అందించడం,గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు జిల్లా లొని 61 GP లతో కూడిన 5 మండలాల్లో MGNREGS పథకం అమలు చేయబడుతోంది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, ఒక గ్రామ పంచాయతీ ఒక నర్సరీ మరియు నర్సరీ స్థాపన బాధ్యత గ్రామ పంచాయతీలపై ఉంది. 2021-22 సం..లో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 29 లక్షల విత్తనాలు నాటాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.

 స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ): స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా, ఐహెచ్హెచ్ఎల్ (వ్యక్తిగత గృహ లెట్రిన్లు) నిర్మాణానికి రూ. 12,000 / – మంజూరు చేయబడ్డాయి. 61 GP లలో 4046 IHHL లు మంజూరు చేయబడ్డాయి మరియు 4046 IHHL లు పూర్తయ్యాయి. 100% స్వచ్ఛమైన గ్రామాలను రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో LOB/NOLB క్రింద మొత్తం 127 కొత్త మరుగుదొడ్లు మంజూరు కాగా,  127 IHHL పూర్తి చేయడం జరిగినది.  

ఎంప్లాయిమెంట్ జనరేషన్ మరియు మార్కెటింగ్ మిషన్ (ఇ.జి.యం.యం) ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు శిక్షణలు మరియు ఉపాధి:

గ్రామీణ నిరుద్యోగ యువతకు శిక్షణల ద్వారా ఉపాధి కల్పించుటకై, డి.అర్.డి.ఏ మరియు ఇ.జి.యం.యం. ద్వారా వారి  అర్హత మరియు ఆసక్తులకు అనుగుణంగా వివిధ శిక్షణలు కల్పించి, వారికి వివిధ  ప్రయివేట్ కంపనీలలో ఉపాధి కల్పించడము జరుగుతున్నది. ఈ శిక్షణలు కంప్యూటర్స్, రిటైల్, సేల్స్, మార్కెటింగ్, అకౌంట్స్ , ఆటోక్యాడ్ , హస్పిటాలిటి మరియు హోటల్ మేనేజ్ మెంట్, సెక్యూరిటీ వంటి రంగాలలో కల్పించ బడును.

2020-21 సంవత్సరములో 5 గ్రామీణ మండలాలలో నిరుద్యోగ యువతకు, మోబిలైజేషన్ మరియు కౌన్సిలింగ్  శిభిరములు నిర్వహించనైనది. 306 మంది నిరుద్యోగ యువత ఇట్టి  శిభిరములకు హాజరయినారు