ముగించు

మైన్స్ & జియాలజీ

గనులు మరియు భూగర్బశాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఖనిజాలను ప్రోత్సహించుట,  నియంత్రించుట మరియు ఖనిజాదాయము ప్రభుత్వానికీ సమకుర్చుట.

ప్రోత్సహించుట: Geological Survey of India ,TSMDC Ltd మరియు MECL తదితర  సంస్థల సహకారంతో నూతన ఖనిజాలను అన్వేషించుట మరియు భూగర్బ ఖనిజాల యొక్క నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించుట.

నియంత్రణ: పెద్ద తరహా ఖనిజాలను మరియు చిన్న తరహా ఖనిజాలను ఖనిజ రాయితీ నియమాలు 1960 మరియు తెలంగాణ చిన్న తరహా ఖనిజ రాయితీ  నియమావళి,1966  ద్వారా నియంత్రణ చేయుట జరుగును. ఈ యొక్క నియమావళి మైన్స్ మరియు మినరల్స్  (అభివృద్ధి మరియు నియంత్రణ )1957 యాక్ట్ ద్వారా సంక్రమించినవి.

            ఖనిజాదాయములో నష్టములు నివారించుట, దరఖాస్తు చేసిన గనులను, క్వారీ  స్థలములను సర్వే మరియు తనిఖీ నిర్వహించిన పిదప కౌలు మంజూరికై సిఫారసు చేయుట. చట్ట విరుద్దమైన పని చేయు క్వారీలు, గనులు మరియు అక్రమ ఖనిజ రవాణాను నివారించుట  మరియు అక్రమ ఖనిజ రవాణాఫై అపరాధ రుసుము వసూలు చేయుట. కౌలు మంజురైన స్థలములో సక్రమ కౌలు నిర్వహణ తనిఖీ చేయుట.ఖనిజాదాయమును ఎప్పటికప్పుడు మదింపు చేసి ప్రభుత్వ ఆధాయమును పెంచుట.ఖనిజాధారంగా ఏర్పాటు చేయబడిన  పరిశ్రమలను తనిఖీలు నిర్వహించి తగు సూచనలు ఇచ్చుట.

కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి క్వారీ లీజుల వివరాలు:

క్ర.సం.           ఖనిజము పేరు        క్వారీ లీజుల సంఖ్య

1                      క్వార్ట్జ్                                      2

2                      రాయి మరియు కంకర          29

మొత్తం           31

 

iii). ఖనిజ ఆదాయము సమకుర్చుట :

ఎ. ఖనిజ రవాణాఫై కౌలుదారు నుండి రాయల్టీ/సీనరేజ్ చార్జీలు వసూలు చేసి ప్రభుత్వ 

    ఖజానాకు జమ చేయుట.

 

బి. కౌలుదారుల  నుండి సంవత్సరపు ముందస్తు అద్దె మరియు ఇతర రుసుములు వసూలు 

    చేయుట.

సి. ఖనిజ ఆదాయము మరియు బకాయిలను  డిఫాల్టర్ల నుండి వసూలు చేయుట.

            2021-21 సంవత్సర ఖనిజ ఆదాయ వివరములు: 2020-2021 ఆర్థిక సంవత్సరములో  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యొక్క ఖనిజ ఆదాయము రూ.2616.10  లక్షలు వచ్చింది.

2021-22 సంవత్సర ఖనిజ ఆదాయ వివరములు :

ఈ సంవత్సరానికి (2021-2022) (ఏప్రిల్’2021 నుండి డిసెంబర్’2021వరకు) నెలవారీ ఖనిజాదాయ వివరముల క్రింది తెలుపబడినది.

క్రమ సంఖ్య నెల పేరు      ఖనిజ ఆదాయము

  1. ఏప్రిల్’2021              రూ.245.71  లక్షలు
  2. మే ’2021               రూ.209.80  లక్షలు
  3. జూన్ ’2021              రూ.357.89  లక్షలు
  4. జులై ’2021                   రూ.286.76  లక్షలు
  5. ఆగష్టు ’2021               రూ.224.56  లక్షలు
  6. సెప్టెంబర్ ’2021  రూ.237.81  లక్షలు
  7. అక్టోబర్’2021              రూ.274.55  లక్షలు
  8. నవంబర్’2021 రూ.186.84  లక్షలు
  9. డిసెంబర్’2021 రూ.366.79  లక్షలు

                        మొత్తం          రూ.2390.74  లక్షలు

జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్(DMFT): క్వారీ లీజు దారులు  మరియు గవర్నమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వారు సీనరేజ్ ఫీజు ఫై 30%   డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT)కి  కట్టడం   జరుగుతుంది.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యొక్క జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్  31.12.2021 వరకు గాను రూ.3790.55 లక్షలు వసూలు చేయడం జరిగింది.