ముగించు

బీసీ సంక్షేమం

ప్రభుత్వ కళాశాల వసతి గృహముల నిర్వాహణ :

            మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా నందు (20) కళాశాల వసతి గృహములు కలవు. ఇందులో (12) బి.సి. బాలుర కళాశాల వసతి గృహములు మరియు (08) కళాశాల వసతిగ్రుహములు  నిర్వహించబడుచున్నవి.  ప్రతివిద్యార్థికి నెలకి రూ.1,500/- చొప్పున డైట్ చార్జీలు చెల్లించబడును .

బి.సి. విద్యార్ధుల పోస్ట్ మెట్రిక్ (యం.టి.ఎఫ్), ఉపకారవేతనాలు మరియు ఫీజురియంబర్స్ మెంట్ పతాకము.

ఇంటర్మీడియట్ నుండి పి. జి మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు  చదువుతున్న బి.సి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక  ఆదాయం గ్రామిణ ప్రాంతాల వారికి  లక్ష యాబై వేలు రూపాయల వరకు మరియు పట్టణ ప్రాంతాలకు చెందినవారికి రెండు లక్షల  రూపాయల వరకు ఉన్న అర్హులైన బి.సి. విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వటం జరుగుతుంది.  పూర్తి వివరముల కోసం వెబ్ సైట్ (www.telangana.epass.gov.in) పరిశీలించగలరు.

ఇ.బి.సి విద్యార్ధులకు ఫీజురియంబర్స్ మెంట్ :

డిగ్రీ నుండి పి. జి వరకు చదువుతున్న ఇ.బి.సి విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక  ఆదాయం ఆదాయం గ్రామిణ ప్రాంతాలకు  లక్ష యాబై వేలు రూపాయల వరకు మరియు పట్టణ ప్రాంతాలకు రెండు లక్షల  రూపాయల వరకు ఉన్న అర్హులైన ఇ.బి.సి విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (RTF) ఇవ్వబడుతున్నాయి.  పూర్తి వివరముల కోసం వెబ్ సైట్ (www.telangana.epass.gov.in) పరిశీలించగలరు. 

  ట్రైనిన్యాయవాదులకు పారితోషికం :

న్యాయ నిర్వహణ శిక్షణ పొందుతున్న బి.సి విద్యార్ధుల కొరకు ప్రభుత్వ౦ జిల్లాకు (4) సీట్లను కేటాయించినది. వారికీ 3) సంవత్సరాల శిక్షణ సమయంలో ప్రతి నెలరూ. 1000/-లు స్టైఫండ్ 585/-రూపాయలు ఎన్రోల్మెంట్ చార్జీలు, అంతేకాకుండా  రూ.3000/- పుస్తకాల కొరకు ప్రభుత్వ౦ చెల్లిస్తుంది.

కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు:

          కులాంతర వివాహాలు చేసుకున్న ప్రతిజంటకు ప్రోత్సాహక బహుమతిగా  రూ.10,000/- లు చొప్పున ఇవ్వబడును. అ) మొదటి వివాహ దృవీకరణ పత్రం ఆ) కుల మరియు ఆదాయ దృవీకరణ పత్రం ఇ) వివాహం జరిగిన ఫోటో ధరఖాస్తుతో పాటు జతపరచవలెను.

కళ్యాణ లక్ష్మిపధకం :

కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం బి.సి. / ఇబిసి పెళ్లికాని బాలికలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను తగ్గించే ఉద్దేశ్యంతో వారి వివాహం కొరకు  రూ .1,00,116 / -మంజూరీ చేయుచున్నది. పూర్తి వివరముల కోసం వెబ్ సైట్ (www.telangana.epass.gov.in) పరిశీలించగలరు. 

మహాత్మా జ్యోతిబా పులే ఓవర్సీస్ విధ్యా నిధి (BC & EBC విధ్యార్థులకు):

 మహాత్మా జ్యోతిబా పులే BC ఓవర్సీస్ విద్య నిధి : తెలంగాణ ప్రభుత్వము జీ. ఓ .యoస్. నo. 23 తేది: 10-10-2016  కొత్త పధకం ప్రవేశపెట్టడం జరిగినది ఇట్టి పథకము ద్వార బి.సి. విద్యార్దిని /విద్యార్డులకు ఉన్నత చదువులకై  విదేశాలకు వెళ్ళుటకు గాను బి.సి.విద్యార్ధుల/ విద్ద్యద్రినిలకు 20,00,000/- మంజూరు చేయబడును.విద్యార్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.5,00,000/- ల లోపు ఉండవలెను.  పూర్తి వివరముల కోసం వెబ్ సైట్ (www.telangana.epass.gov.in) పరిశీలించగలరు. 

 కార్పొరేట్ జూనియర్ కళాశాలలలో  ఇంటర్ అడ్మిషన్స్ (DRDA)

               జిపిఎ గ్రేడ్ 7 మరియు అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన రాష్ట్ర ఎస్ఎస్సి లేదా 10 వ తరగతి బిసి / ఇబిసి విద్యార్ధిని ,విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప  అవకాశం ఇవ్వబడింది. టిఎస్ ఇపాస్ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్ ద్వారా తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కళాశాలలలో  ఇంటర్ అడ్మిషన్సకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బి.సి.కార్పొరేషన్ ద్వార అమలు చేయబడుచున్న పధకముల వివరములు :

 తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఆర్దిక సహకార సంస్థ లిమిటెడ్ ద్వార మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాదారిద్ర్యరేఖకు దిగువనున్న గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికీ మార్జిన్ మని పథకము మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి సావిత్రిబాయీ ఫూలే అభ్యుదయ యోజన పథకము ద్వార బి.సి కులాల వారికి మరియు అత్యంత వెనుకబడిన తరగతుల వారికి తెలంగాణ అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్ధిక అభివృద్ధి సంస్థ ద్వారా  వివిధ ఫెడరేషన్ ల ద్వారా వృతి పనివారలకి  ఈ క్రింది మూడు కేటగిరిల ద్వారా ఆర్ధిక సహాయం అందించబడును.  (website: https://tsobmms.cgg.gov.in)

నిధుల మంజూరి  విధానం :

క్రమ సంఖ్య

యూనిట్ విలువ

సబ్సిడీ

బ్యాంకు ఋణము

1

కేటగిరి – I

(యూనిట్ విలువ రూ.1.00 లక్ష వరకు)

80% సబ్సిడీ

20%  బ్యాంకు ఋణము లేదా

 లబ్ధిదారుని వాటా

2

కేటగిరి – II

(యూనిట్ విలువ రూ.1.01 లక్ష నుండి     రూ. 2.00 లక్షల వరకు)

70% సబ్సిడీ

30%  బ్యాంకు ఋణము లేదా లబ్ధిదారుని వాటా

3

కేటగిరి – III

(యూనిట్ విలువ రూ.2.01 లక్ష నుండి రూ. 12.00 లక్షల వరకు)

60% సబ్సిడీ

 లేదా రూ.5.00 లక్షలు  ఏది తక్కువ అయితే అది

40%  బ్యాంకు ఋణము లేదా లబ్ధిదారుని వాటా

ఆదాయ పరిమితి :

  1. గ్రామీణ ప్రాంతాల వారికి ఆదాయ పరిమితి రూ. 1,50,000 లోపు
  2. పట్టణ ప్రాంతాల వారికి ఆదాయ పరిమితి రూ. 2,00,000 లోపు

వయెపరిమితి :

  1. వయెపరిమితి 21 సo. నుండి 55 సo. వరకు
  2. వ్యవసాయ రంగాల వారికి వయెపరిమితిని 60 సం. వరకు

బి.సి.సమాఖ్యల వివరములు:

          ఈ క్రింది 11 బి.సి. సమాఖ్యలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా ఆధ్వర్యములో పనిచేయుచున్నవి. అవి 1) తెలంగాణ రజక సహకార సంఘముల సమాఖ్య 2) తెలంగాణ నాయీ బ్రాహ్మణ సహకార సంఘముల సమాఖ్య 3) తెలంగాణ వడ్డెర ఆర్ధిక సహకార సంఘముల సమాఖ్య 4) తెలంగాణ సగర /ఉప్పర సహకార సంఘముల సమాఖ్య 5) తెలంగాణ వాల్మీకి / బోయ సహకార సంఘముల సమాఖ్య 6) తెలంగాణ భట్రాజు సహకార సంఘముల సమాఖ్య 7) తెలంగాణ విశ్వబ్రాహ్మణ సహకార సంఘముల సమాఖ్య 8) తెలంగాణ కుమ్మర/శాలివాహన సహకార సంఘముల సమాఖ్య 9) తెలంగాణ కృష్ణ బలిజ/పూసల సహకార సంఘముల సమాఖ్య 10) తెలంగాణ మెదర సహకార సంఘముల సమాఖ్య 11) తెలంగాణ కల్లుగీత సహకార సంఘముల సమాఖ్య. (www.tsobmms.cgg.gov.in)

ఉద్దేశములు:

            ఈ సమాఖ్యల యొక్క ఉద్దేశములు ఏమనగా 11  సమాఖ్యలకు సంభందిచిన కులాలకు చెందిన (15 మంది సబ్యులతో) ప్రాధమిక సహకార సంఘముగా  ఏర్పాటు చేసి కడు బీద వారికీ ఆర్దిక సహాయము అందచేసి వారిని ఆర్దికముగా బలోపేతము చేయుట ( అభివృది పరుచుట ) ముఖ్య వుద్దేశము.

ఉచిత విద్యుత్ పధకం: హెయిర్ కటింగ్ సెలూన్, లాండ్రీ షాప్ మరియు ధోబిఘాట్ లకు :

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులచే నిర్వహించబడుచున్న హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ లకు మరియు రజకులచే నిర్వహించబడుచున్న లాండ్రీ షాప్ మరియు ధోబిఘాట్ ల   కొరకు ఉచిత విద్యుత్ పధకం 250 యూనిట్ల వరకు అమలు చేయబడుచున్నది. (www.tsobmms.cgg.gov.in)

రజకులకు ధోభిఘాట్ :

            తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రజక సహకార సంఘముల సమాఖ్య ద్వారా రజకులు వారి వృతి పని కోసం ధోబిఘాట్ ల నిర్మాణానికి రూ.10,00,000/-  వరకు మంజూరు చేయబడును.

ధోభిఘాట్ నిర్మించడానికి కావలసిన పత్రములు:

  1. 20 గుంటల భూమి. ప్రభుత్వ భూమి అయితే భూమి కెటాయింపు మంజూరి పత్రము.  భూమి గ్రామ పంచయతీది అయినచో గ్రామపంచాయతీ తీర్మానము.
  2. రజకుల సంఘం తీర్మానం కాపి మరియు ధొబిఘాట్ నిర్వహణ కొరకు  గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ లేక సంఘం అంగీకార పత్రము.
  3. భూగర్భ జల శాఖ వారి నుండి భూగర్భజల ద్రువీకరణ పత్రం.
  4. విద్యుత్ శాఖ వారి నుండి విద్యుత్ సౌకర్య పతము.
  5. ధోభిఘాట్  నిర్మాణ రూప కల్పన మరియు ధోభిఘాట్  నిర్మాణo కొరకు మండల ఏ.ఈ. గారి నుండి ఎస్టిమేట్ తయారు చేయవలెను.