ముగించు

దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ గౌతమ్

13/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–2                         తేదీ : 11–11–2023
==================================    
దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ గౌతమ్ ,
దీపావళి పర్వదినాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ గౌతమ్  ఆకాంక్షించారు.
ఆదివారం  దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ గౌతమ్  దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండగ అంటే దుష్టశక్తులపై ధైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పండగను జరుపుతామని… అలాగే దీపావళి రోజున లక్ష్మీ, సరస్వతీ పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో ఉంటారన్నారు. బాణసంచా  విషయంలో పిల్లల పట్ల  పెద్దలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ప్రజలు  తమ తమ రంగాలలో  మరింత ఉత్సాహంతో విజయాలు సాధించాలని కలెక్టర్ గౌతమ్ ఆకాక్షించారు,