ముగించు

జిల్లాలో రూ.50.96 కోట్లకు పైగా నగదు స్వాధీనం, జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.40 కోట్లకు పైగా నగదు తిరిగి అప్పగింత మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

20/11/2023 - 05/12/2023

Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                                       తేదీ : 19–11–2023
=========================================
జిల్లాలో రూ.50.96 కోట్లకు పైగా నగదు స్వాధీనం,
జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.40 కోట్లకు పైగా నగదు తిరిగి అప్పగింత
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు రూ. 50, 96, 86, 905 (యాభై కోట్ల తొంభై ఆరు లక్షల, ఎనభై ఆరువేల తొమ్మిది వందల ఐదు రూపాయలు) నగదును స్వాధీనం చేసుకొని అలాగే ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఆధ్వర్యంలో ఒక లక్ష తొంబై వేళా నాలుగు వందల ఏడు  ( 1,90,407)   లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 979 కేసులు నమోదు 426 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని… చేసినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్న రూ. 40, 14, 75, 823 నగదు తిరిగి అప్పగింత
ఈ మేరకు జిల్లా  గ్రీవెన్స్ కమిటీ అధికారులు అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించి అన్ని రకాల ఆధారాలు సరిగ్గా ఉన్న కేసులకు సంబంధించి 347 కేసులకు సంబంధించి రూ. 40, 14, 75, 823 (నలభై కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిదివందల ఇరవై మూడు రూపాయలు) తిరిగి అప్పగించినట్లు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అధికారులు, పోలీసులు వాహనాలు, తదితరాలు తనిఖీలు చేపట్టడం, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్ళరాదని… ఒకవేళ తీసుకువెళ్ళేట్లయితే అందుకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని లేనట్లయితే  నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, మద్యం తరలింపుపై నిరంతరం పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా నిఘా కొనసాగుతుందని..ఈ విషయంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు.  అలాగే పట్టుకొన్న నగదును అన్ని రకాల రశీదులు, తగిన సాక్ష్యాలతో తిరిగి తీసుకొనేందుకు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఎఫ్–12లో గ్రీవెన్స్ కమిటీ లో సంప్ర దించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.