ముగించు

జిల్లా లో మొత్తం నామినేషన్లలు 261, అర్హత పొందిన వారు 190 మంది అభ్యర్థులు 71 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

14/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–2                                   తేదీ : 13–11–2023
=========================================
జిల్లా లో మొత్తం నామినేషన్లలు 261,
అర్హత పొందిన వారు 190 మంది అభ్యర్థులు
71  మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
జిల్లాలోని ఐదు  అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్  తెలిపారు.
సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు  అసెంబ్లీ నియోజకవర్గాల లో ఈ సందర్భంగా 71 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని వివరించారు. ఐదు  అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 261 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, స్క్రుటినీలో 71 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 190 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు.  మేడ్చల్  అసెంబ్లీ నియోజకవర్గంలో  67  మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, 38 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు. మల్కాజ్గిరి  నియోజకవర్గంలో 41 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, 8 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. కుతుబుల్లా పూర్ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా, 10 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని వివరించారు. కూకటిపల్లి అర్బన్ సెగ్మెంట్ లో 26 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, 12 మంది అభ్యర్థులవి తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. ఉప్పల్  నియోజకవర్గంలో 34 మంది అభ్యర్థుల నామపత్రాలు చెల్లుబాటు అవగా, 3 నామినేషన్ తిరస్కరించబడిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
తెలిపినారు