ముగించు

ర్యాండమైజేషన్ ఆధారంగా నియోజకవర్గాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల పంపిణీ, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

18/11/2023 - 05/12/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–2                                       తేదీ : 17–11–2023
=========================================
ర్యాండమైజేషన్ ఆధారంగా నియోజకవర్గాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల పంపిణీ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
జిల్లాలో ర్యాండమైజేషన్ సంఖ్యను ఆధారంగా తీసుకొని అవసరమైన నియోజకవర్గాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లాలోని గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులతో కలిసి మేడ్చల్, కుత్భుల్లాపూర్, కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఆక్సిలరీ  పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అదనపు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయింపులు జరిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 735 బ్యాలెట్ యూనిట్లు, 5 కంట్రోల్ యూనిట్లు, కుత్భుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 12 బ్యాలెట్ యూనిట్లు, 12 కంట్రోల్ యూనిట్లు, కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 525 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని వాటిని ర్యాండమైజేషన్ చేసి అందచేయడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి కంటే ఎక్కువ ఉన్నందున అదనపు బ్యాలెట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఉప్పల్, మల్కాజిగిరి రెండు కంటే ఎక్కువగా ఉన్నందున అదనపు బ్యాలెట్ యూనిట్లు ఫస్ట్లెవల్ చెక్ ఈవీఎమ్ గోడౌన్లో జరుగుతోందని…. అనంతరం వాటిని ఆయా నియోజకవర్గాలకు పంపడం జరుగుతుందని తెలిపారు.అనంతరం జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు వారు తమ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని అంశాలను సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి తెలియజెప్పారు. పోలింగ్ కేంద్రాలలో 1500 కంటే అధికంగా ఓటర్లు ఉంటే అదే స్థలంలో ఆక్సిలరీపోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉండే ఫిర్యాదుల పరిష్కారానికి సి విజల్ యాప్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే తప్పకుండా సువిధ యాప్ను, 1950ని వినియోగించుకోవాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు.