ముగించు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

08/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri CollectorMedchal-Malkajgiri CollectorMedchal-MalkajgiriMedchal-Malkajgiri

*రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి,
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను  నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్. బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ,  డి.సి.పి. శబరీష్  నోడల్ అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
@@@@@@@@@@
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు పాటిస్తూ విధుల నిర్వహణ….
*ఈవిఎం యంత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా సిద్దం చేయాలి,
*సి విజల్ యాప్ పై విస్తృతంగా  ప్రచారం కల్పించాలి,
*రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతులను నిబంధనల మేరకు సకాలంలో అందించాలి,
కలెక్టరేట్ సమావేశ మందిరములో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం నోడల్  అధికారుల తో  జిల్లా కలెక్టర్ గౌతమ్  మాట్లాడుతూ,   నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని, నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు.  ఎన్నికల తనిఖీలలో నగదు, బంగారం, ఇతర ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో క్షేత్రస్థాయిలో వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల ప్రచారం సంబంధించిసమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి  వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో  అనుమతులు మంజూరు చేయాలని అన్నారు.  జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
సువిధ యాప్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ నిబంధనలకు లోబడి ఉన్న వాటికి నిర్ణీత గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని, అనుమతుల జారీలో జాప్యం చేయరాదని సూచించారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. 1950 టోల్ ఫ్రీ, సి.విజిల్, కంట్రోల్ రూమ్ ల ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. ఫారం-6 , ఫారం-8 ల బదలాయింపు ప్రక్రియను నిరంతంరం పర్యవేక్షిస్తూ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని అన్నారు.  పోలింగ్ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన పనులు ఏమిటీ, చేయకూడనివి ఏమిటీ అనే అంశాలపై పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న వారందరికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. వెబ్ క్యాస్టింగ్ కోసం ఎంపిక చేసిన వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. తనిఖీల సందర్భంగా నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసే సమయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని హితవు పలికారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, దివ్యంగుల ఇళ్లకు వెళ్లి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్   సూచించారు.
ఈ సమావేశము లో నోడల్ అధికారులు  ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.