• సోషల్ మీడియా లింకులు
  • Site Map
  • ప్రాప్యత లింకులు
  • తెలుగు
ముగించు

ఫిర్యాదులు, సలహాలు, సూచనలకై పరిశీలకులను సంప్రదించవచ్చు , మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

14/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                         తేదీ : 13–11–2023
==================================    
ఫిర్యాదులు, సలహాలు, సూచనలకై పరిశీలకులను సంప్రదించవచ్చు ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా  అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులను భారత ఎన్నికల కమిషన్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్  తెలిపారు.
సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులు,చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,సూచించారు. జిల్లాలోని, మేడ్చల్,(43 ) నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్, ఎస్.కె.జైన్, (ఐ.ఏ.ఎస్), మల్కజగిరి(44) ,ఉప్పల్, (45)నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్  పూర్వా గార్గ్,(2015) ఐఏఎస్, ను కుత్భుల్లాపూర్,(45 ) కూకట్ పల్లి,(46 ) నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్  అమన్ మిట్టల్ ,(ఐ.ఏ.ఎస్), లను నియమిచ్చారు అని తెలిపినారు. ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయదలచిన వారు మేడ్చల్,(43 ) నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్, ఎస్.కె.జైన్, (ఐ.ఏ.ఎస్),   సెల్ నెంబర్ 73370-47775 కు ఫోన్ చేయవచ్చని, మేడ్చల్  రిటర్నింగ్ ఆఫీస్ లో ప్రతిరోజూ 12.00 గంటల నుండి 1 .00 గంటల మధ్యన నేరుగా కలువవచ్చని తెలిపారు.  మల్కజగిరి(44) ,ఉప్పల్, (45)నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్  పూర్వా గార్గ్,(2015) ఐఏఎస్, సెల్ : 73370-47776, వీరిని కలెక్టరేట్ లోని మొదటి అంతస్తు లో F- 26 లో ప్రతిరోజూ సాయంత్రం 4.00 నుండి 5 .00 గంటల మధ్యన నేరుగా కలువవచ్చని తెలిపారు.   కుత్భుల్లాపూర్,(45 ) కూకట్ పల్లి,(46 ) నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్  అమన్ మిట్టల్ ,(ఐ.ఏ.ఎస్) , సెల్ : 73370-47778, ద్వారా సంప్రదించవచ్చని ,.ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్, ప్రగతి నగర్ లో ప్రతిరోజూ సాయంత్రం 4.00 నుండి 5 .00 గంటల మధ్యన నేరుగా కలువవచ్చని తెలిపారు. . జిల్లా లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అబ్జర్వర్లు జిల్లాలోనే ఉండి ఎన్నికల సంబంధిత అంశాలను పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు.