ముగించు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., పోస్టల్ బ్యాలెట్ల సరళిని పరిశీలించారు.

25/11/2023 - 07/12/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkakgiri Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                      తేదీ : 24–11–2023
=================================
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సరళిని పరిశీలించిన ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమదాయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ల సరళిని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎన్నికల సాధారణ  అబ్జర్వర్ ఎస్.కె.జైన్,కలిసి పరిశీలించారు.   ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్, మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ సరళిని ఎలాంటి పొరపాట్లు  చెయ్యొద్దని,  ఓటు వేయడానికి వచ్చే ప్రతి  ఓటర్ కి గుర్తింపు కార్డు  ఉండాలని అన్నారు .ఫారం 13ఏ, 13బి, 13సి లను సరిచూసుకోవాలని,  పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ గురించి,  రాజకీయా పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముందే సమాచారం ఇచ్చామని,  ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఉద్యోగి తన విలువైన ఓటు వినియోగించాలని ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని , పోస్టల్ బ్యాలెట్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు  చేసామని  కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు .
ఇతర జిల్లా ల నియోజక వర్గం నుంచి వచ్చి మేడ్చల్ – మల్కాజిగిరి లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది  IDOC లో ఓటు హక్కు వినియోగించుకోవాలని, తెలియజేశారు . పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కోవడానికి వీలుగా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఫెలిటిటేషన్ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని, సిబ్బంది విధి గా ఓటు హక్కును వినియోగించు కోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమం లో పోస్టల్ బ్యాలెట్ల నోడల్ అధికారి వంశి మోహన్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.