ముగించు

పోలింగ్ కేంద్రాలు, ఉప్పల్, మల్కాజిగిరి, డిఆర్‌సి సెంటర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు ఐఏఎస్.,లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

29/11/2023 - 07/12/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి,
ఉప్పల్ , మల్కాజ్గిరి, డీఆర్సీ కేంద్రాన్ని పరిశీలించిన ,
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
ఉప్పల్ జవహర్ లాల్ నెహ్రు  ప్రభుత్వం పాలిటెక్నిక్  కాలేజీ ,రామంతాపూర్ ,భవన్స్  వివేకానంద  కాలేజీ  ,సైనిక్ పూరి, మల్కాజ్గిరి,  డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్రూమ్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లా పరిధి లోని ఉప్పల్ ,మల్కాజ్గిరి,  పోలింగ్ డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూమ్, రిటర్నింగ్ అధికారి కార్యాలయం, రిటర్నింగ్ అధికారులు అభిషేక్ అగస్త్య, రవి కిరణ్ తో కలిసి పోలింగ్ కేంద్రాలనుఆయన పరిశీలించారు. డీఆర్సీ కేంద్రంలో ఉన్న వసతుల వివరాలను రిటర్నింగ్ అధికారులు, అడిగి తెలుసుకొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు తప్పనిసరిగా కల్పించాలని, బూత్ లెవల్ అధికారుల సమన్వయంతో ర్యాంప్, మంచినీరు, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా క్షేత్రస్థాయిలో వసతులు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్క్యాస్టింగ్ కోసం సరైన విద్యుత్తు సౌకర్యం ఉండేలా చూడాలని, వసతులు కల్పించిన అనంతరం పూర్తి వసతులు వుండే విధముగా చర్యలు తీసుకోవాలని  సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి లు, ఎఈ ఆర్ ఓ లు ఆయా శాఖల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.