నవంబర్ 30 పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
నవంబర్ 30 పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు,
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లోని నవంబర్ 30 న పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపినారు .
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తేది 30-11-2023 గురువారం రోజున రాష్ట్రంలోని 119 అసెంబ్లి నియోజకవర్గాల పరిధీ లొని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వేతనంతో కూడిన ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం రాజపత్రాన్ని(Gazette) జారీచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించినందున మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధి లొని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజిగిరి నియోజకవర్గం, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం,కుత్భుల్లాపూర్ నియోజకవర్గం, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం, లలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వీనియోగం చేసుకోని జిల్లాలో వందశాతం ఓటింగ్ జరగేలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ కోరినారు .