ముగించు

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు… వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,

07/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri Collector in Video ConferenceMedchal-Malkajgiri Collector in Video ConferenceMedchal-Malkajgiri Collector in Video ConferenceMedchal-Malkajgiri Collector in Video Conference

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు…
వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,

కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన వ్యయ నియంత్రణ బృందం నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఎస్ ఎచ్ అజయ్ బదూ , రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, సోమవారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,  జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ,  ఎన్నికల అధికారులు శ్రీనివాస మూర్తి, నర్సింహ, కృష్ణారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వారితో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు పాటిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి పకడ్భందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వీడియో సమావేశంలో తెలిపారు.  ఈ సందర్భంగా ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు మొత్తం రూ. 43, 62, 23, 331 (నలభై మూడు లక్షల అరవై రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ముప్పూ ఒక్క రూపాయలు) నగదు, బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో రూ. 18, 95,31,161 ( పద్దెనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల  ఒక్క వంద అరవై ఒక్క రూపాయలు)  నగదును, రూ. 24,66,92,170 (ఇరవై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల తొంభై రెండు వేల ఒక్క వంద డెబ్బై రూపాయల) విలువ గల ఆభరణాలు, 1,24,098  లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొన్నట్లు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి 645  కేసులు నమోదయ్యాయని…321  మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో జిల్లా  గ్రీవెన్స్ కమిటీ అధికారులు అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించి అన్ని రకాల ఆధారాలు సరిగ్గా ఉన్న కేసులకు సంబంధించి రూ.13,18,81,448 నగదుకు గాను రూ. 8,69, 30, 114 అప్పగించినట్లు  సరైన ఆధారాలు లేని రూ.4,25(నాలుగు కోట్ల ఇరవ్య ఐదు లక్షల ) ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. దీంతో పాటు గ్రీవెన్స్ కమిటీకి సంబంధించి వచ్చిన కేసులను పరిశీలించి సరైన ఆధారాలు ఉంటే వాటిని డిస్పోజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఆయా కేసులలో ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ వారికి సమాచారం అందించి కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్వ్కాడ్, సర్వేలెన్స్, తదితర బృందాలతో ఇప్పటికే మూడుసార్లు ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలో తనిఖీల సమయంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు తదితరాలు లభించినట్లయితే ఇన్కం ట్యాక్స్ వారికి పంపిస్తున్నామని వివరించారు.  జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా, పకడ్భందీగా అమలు చేస్తున్నామని ఈ విషయంలో పోలీసులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు తెలిపారు.