ముగించు

జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, రేపు పోలింగ్ రోజున ఓటు వేయడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,

30/11/2023 - 07/12/2023

Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                          తేదీ : 29–11–2023
=========================================

జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోంచుకోవలి,
రేపే పోలింగ్ డే
ఓటు వేయడం మన బాధ్యత
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,

రేపు నవంబర్ 30వ తేదీ గురువారం రోజున రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, చెప్పారు.
సాధారణ ఎన్నికలు 2023, ఎన్నికల నియమావళి అమలులో బాగంగా జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు వేయాలని, దేశ పౌరులుగా ఏన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవడం మన బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,పిలుపునిచ్చారు.
 ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటుకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని,  ఓటరు ఇన్ ఫర్మెషన్ స్లిప్ ఓటరుకు అవగాహన కల్పించడానికి మాత్రమే పనిచేస్తుందని, ఎపిక్ కార్డు కాకుండా 12రకాల ఓరిజినల్ ఫోటో  గుర్తింపు కార్డులలో ఎదో ఒకటి ఓటరు పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యత పై విస్తృతంగా అవగాహన కల్పించామని, ఓటరు కార్డు స్లిప్పులు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని తీసుకుని వెళ్లి ఓటు వేయాలని కోరారు.
నవంబర్ 30వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని, నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అందరికీ ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసే వరకూ సైలెంట్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్  కూకట్ పల్లి , ఉప్పల్, నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి పౌరుడు ఓటు వేయడం మరువొద్దని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశం ఒక్క ఓటుకు మాత్రమే ఉందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిరంతరం పనిచేసే హెల్ప్ లైన్ 1950 నెంబరు ద్వారా కానీ, www.voters.eci.gov.inwww.ceotelengana.nic.in వెబ్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటరు హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తమ పోలింగ్ కేంద్రం, బూత్ నెంబర్ తదితర వివరాలు తెలుసుకోవచ్చునని సిద్ధిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, వివరించారు.