ముగించు

జిల్లా కలెక్టరేట్లోని ఎంసీఎంసీ మీడియా సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల సాధారణ ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, పోలీస్ అబ్జర్వర్ నేహా యాదవ్,

18/11/2023 - 05/12/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                                       తేదీ : 16–11–2023
=========================================
జిల్లా కలెక్టరేట్లోని ఎంసీఎంసీ మీడియా సెంటర్ ను  పరిశీలించిన ఎన్నికల సాధారణ ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, పోలీస్ అబ్జర్వర్ నేహా యాదవ్,
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఈ విషయంలో ఎంసీఎంసీ మీడియా సెంటర్లో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరంఉందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్ (మేడ్చల్), పూర్వాగార్గ్  (ఉప్పల్, మల్కాజిగిరి), జిల్లా పోలీసు అబ్జర్వర్ నేహాయాదవ్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్కు వచ్చిన వారు కలెక్టరేట్లో ఏర్పాటు జిల్లా గ్రీవెన్స్ కమిటీకి సంబంధించి పూర్తి వివరాలను కమిటీ సభ్యులు శ్రీనివాసమూర్తిని అడిగి తెలుసుకొన్నారు. గ్రీవెన్స్ కమిటీకి సంబంధించి సీజ్ చేసిన నగదు, తదితరాలు ఎంత మేరకు తిరిగి ఇచ్చారనే వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకొన్నారు, స్టాటిక్ సర్వే లెన్స్, వీడియో సర్వేలెన్స్ బృందాల లైవ్ స్ట్రీమింగ్ను పరిశీలించి కంట్రోల్ రూమ్ పనితీరును అడిగి తెలుసుకొని పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎన్నికల లో ప్రకటనలు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికేషన్ చేయనున్నట్లు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు డీఏవీపీ, డీఐపిఆర్ రేట్లు, ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, సోషల్ మీడియా, ఫేక్ న్యూస్, పెయిడ్ న్యూస్ వివరాలను అడిగి తెలుసుకొన్నారు అలాగే సామాజిక మాధ్యమాలలో జరిగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సోషల్ మీడియా సెల్ యాక్టివ్గా పని చేస్తుందని ఇదే విధంగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కొనసాగించాలని ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ ఛానళ్ళలో వచ్చే ఆయా రాజకీయ ప్రకటనలు, రాజకీయ ప్రచారాల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వా గార్గ్, జిల్లా పోలీస్ అబ్జర్వర్ నేహాయాదవ్ పేర్కొన్నారు.