ముగించు

జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 64 నామినేషన్ల ఉపసంహరణ… ఎన్నికల బరిలో 126 మంది అభ్యర్థులు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

16/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                                       తేదీ : 15–11–2023
=========================================
జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో  64 నామినేషన్ల ఉపసంహరణ… ఎన్నికల బరిలో 126 మంది అభ్యర్థులు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యిందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు కాగా జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లలో 64 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా… 126 మంది ఎన్నికల బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి….
+ మేడ్చల్(43) నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 105 నామినేషన్లను స్వీకరించగా… స్క్రూటినీలో 38 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా అందులో 67 మిగిలాయి… అనంతరం 67 అభ్యర్థులలో 45 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 22 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
+ మల్కాజిగిరి (44) అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 49 నామినేషన్లను స్వీకరించగా… స్క్రూటినీలో 8 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా అందులో 41 మిగిలాయి… అనంతరం 41 మంది  అభ్యర్థులలో 8 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
+ కుత్భుల్లాపూర్(45) అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 32 నామినేషన్లను స్వీకరించగా… స్క్రూటినీలో 10 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా  22 మంది మిగిలారు… అనంతరం 22 మంది అభ్యర్థులలో 7 గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
+ కూకట్పల్లి (46) అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 38 నామినేషన్లను స్వీకరించగా… స్క్రూటినీలో 12 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా… 26 మంది మిగిలారు.. . అనంతరం 26 మంది అభ్యర్థులలో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకోగా…  24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
+ ఉప్పల్ (47) అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 37 మంది నామినేషన్లు స్వీకరించగా… స్క్రూటినీలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా… 34 మంది మిగిలారు… అనంతరం 34 మంది అభ్యర్థులలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా… 32 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.