ముగించు

జిల్లాలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కృషి. ఎన్నికల పర్యవేక్షణ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,

13/11/2023 - 30/11/2023

Medchal-Malkajgiri CollectorMedchal-Malkajgiri CollectorMedchal-Malkajgiri CollectorMedchal-Malkajgiri CollectorMedchal-Malkajgiri CollectorMedchal-Malkajgiri CollectorMedchal-MalkajgiriMedchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                                 తేదీ : 11–11–2023
=========================================
 జిల్లాలో  పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కృషి.
ఎన్నికల పర్యవేక్షణ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
శనివారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా  కలెక్టరేట్ లోని సమావేశ మందిరము లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల మీద మేడ్చల్, రంగారెడ్డి, జిల్లాల ఎన్నికల సాధారణ పరిశీలకులు  పోలీస్ జనరల్ అబ్జర్వర్లు , రాచకొండ కమిషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపిఎస్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర ఐపిఎస్, అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికేళి  ఐఏఎస్, ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.  
ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు చేపట్టిన చర్యల గురించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, జిల్లా లోని ఐదు నియాజకవర్గాలకు సంబందించిన సమాచారం తీసుకొన్న  చర్యలు అబ్జర్వర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  వివరించారు.
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పై వివరిస్తూ జిల్లాలోని మొత్తం ఓటర్లు(28,19,067) 28 లక్షల 19వేల 067 మంది వారిలో పురుషులు(14,59,629) 14లక్షల 59 వేల 629 మరియు స్త్రీలు (13,59,057) 13 లక్షల 59వేల 057 మంది థర్డ్ జెండర్ 381 మంది అని తెలిపినారు జిల్లా వ్యాప్తంగా 438 లొకేషన్స్ లో పోలింగ్ స్టేషన్స్ 2397 ఉండగా వీటిలో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ 2239 రూరల్ పోలీస్ స్టేషన్ 158 ఉన్నాయని తెలిపినారు ., నూతన ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులను  పోస్టు మరియు బిఎల్ఓల  ద్వారా ఓటరుకు చేర్చడం జరుగుతుందని తెలిపారు. ఐదు నియోజక వర్గాలలో  క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని,  మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేసుకొని ఆయా నియోజక వర్గాల  ఆర్.ఓ లకు ఈవియం, వివిపాట్, సియులను అందించడం జరిగిందని  తెలిపారు.  జిల్లాలో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా అనుమతుల జారీలో ఆలస్యం జరగకుండా చూడడంతో పాటు ఉల్లంఘనలపై కూడా త్వరితగతంగా చర్యలు తీసుకోవడం జరుగుతందని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఐడిఓసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సి.విజిల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్.ఎస్.టీ, ఎస్.ఎస్.టీ బృందాలు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకున్నామని, వారి వాహనాలకు అధునాతన పీటీజెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,  వివరించారు.
ఎలక్షన్ కోడ్ తు.చ తప్పకుండా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను నియమించి పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. అభ్యర్థులు, ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి అన్ని విధాలుగా పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని  ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, తెలిపినారు. సరిహద్దు ప్రాంతాల్లో 14 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సి.సి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజెషన్ పూర్తి చేసి నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చామని, పోలింగ్ సిబ్బందికి సైతం శిక్షణ తరగతులు నిర్వహించామని, మలివిడత ర్యాండమైజెషన్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలలో విధులను కేటాయిస్తామని అన్నారు.
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్ల నమోదు కొరకు నియోజక వర్గం వారిగా ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, జిల్లా లో  24,768, మంది వికలాంగులు, 33,216 మంది వృద్దుల కొరకు ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని, మరియు హోమ్ ఓటింగ్ లో భాగంగా బిఎల్ఓ ల ద్వారా ఫామ్-12డిలను అందించడం జరిగిందని, ఇందుకు నియోజక వర్గాల  వారిగా నోడల్ అధికారులను కూడా నియమించడం జరిగిందని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,వివరించినారు. ఈ నెల 18 న ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజెషన్ చేపట్టి ఆ జాబితా ప్రకారంగా పోలింగ్ స్టేషన్లకు కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వివి.ప్యాట్లు కేటాయిస్తామని, ఈ.సీ ఆదేశాలకు అనుగుణంగా 25 శాతం సీ.యూ, బీ.యూలు, 40 శాతం వివి.ప్యాట్లు అదనంగా (రిజర్వు) కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు గాను 310 మంది అభ్యర్థులు 356, సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు.
జిల్లాలో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా అనుమతుల జారీలో ఆలస్యం జరగకుండా చూడడంతో పాటు ఉల్లంఘనలపై కూడా త్వరితగతంగా చర్యలు తీసుకోవడం జరుగుతందని తెలిపారు.
అనంతరం రాచకొండ కమిషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపిఎస్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర ఐపిఎస్, మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని పరిశీలకుల దృష్టికి తెచ్చారు. ఓటర్లను ప్రలోభపర్చే చర్యలను నిరోధించేందుకు వీలుగా జిల్లా సరిహద్దులలో నాలుగు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు,   అంతర్ జిల్లా చెక్ పోస్టులు నెలకొల్పి నిరంతరం తనిఖీలు జరిపిస్తున్నామని, ఇవే కాకుండా జిల్లా అంతటా డైనమిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు. సరిహద్దు   జిల్లా పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించి సరిహద్దు ప్రాంతం నుండి అక్రమ మద్యం, నగదు, ఇతర వస్తువులు రాకుండా కట్టడి చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అదేవిధంగా హోలీ మేరి ఇంజినీరింగ్  కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించారు. కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూంలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తదితర వాటిని పరిశీలించారు.
ఈ కార్యక్రమము లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద ర్రెడ్డి,,రిటర్నింగ్ అధికారులు మరియు అభికరి సఖ అధికారులు పోలీస్ అధికారులు, న్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.