ముగించు

జిల్లాలో ఎన్నికల సిబ్బందిచే మూడవ రౌండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ, సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీ.ఎస్.కె.జైన్, శ్రీ.పూర్వగర్గ్, శ్రీ.అమన్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు ఐ.ఎ.ఎస్., ర్యాండమైజేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.

29/11/2023 - 07/12/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–3                             తేదీ : 28–11–2023

=========================================
జిల్లాలో ఎన్నికల సిబ్బంది మూడవ  విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ,
ర్యాండమైజేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, అమన్ మిట్టల్ , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందిని సంబంధించి మూడవ  విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు మంగళ వరం  జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరములో  జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, అమన్ మిట్టల్ , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని మేడ్చల్,కు 584,  మల్కాజిగిరి, 429, కుత్భుల్లాపూర్, 590,కూకట్పల్లి,418 ఉప్పల్  418, బృందాల ఏర్పాటు శాసనసభ నియోజక వర్గాలకు సంబంధించి మొత్తం 2439  పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 12510,  మందిని మూడవ  విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులో 2880 మంది పీవోలు, 2860  మంది ఏపీవో లు, 6570 మంది ఓపీవోలు ఉన్నారని తెలిపారు.  ప్రతి టీమ్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు.  రిజర్వ్ టీమ్ లకు శిక్షణ ఇచ్చి, హోమ్ ఓటింగ్ కు ఉపయోగించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాకు సంబంధించి మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టి… అవసరమైన 200 మంది మైక్రో అబ్జర్వర్ల ఎంపిక పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో , జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.