జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి, సీ– విజిల్ యాప్లో ఫిర్యాదులపై వంద నిమిషాల్లో తక్షణ చర్యలు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
పత్రిక ప్రకటన–2 తేదీ : 19–11–2023
=========================================
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి,
సీ– విజిల్ యాప్లో ఫిర్యాదులపై వంద నిమిషాల్లో తక్షణ చర్యలు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా రూపొందించిన సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సీ– విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులో ఫిర్యాదుదారు ఫోన్ నెంబర్, వివరాలు లేకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీ, అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్తులపై పోస్టర్లు, ప్రచారం, ఓటర్లకు బెదిరింపులు, రాత్రి పది గంటల తర్వాత ప్రచారం తదితర వాటిపై సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. యువత ఓటు తప్పనిసరిగా వేయాలని, ఓటు వేసే సామాజిక బాధ్యతను ఎప్పటికి మరువకూడదని పేర్కొన్నారు. సీ– విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు 100 నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎన్నికలలో విద్వేష ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, ఇతర ఉల్లంఘనలపై సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుని ఫోన్ నెంబర్, వివరాలు గోప్యంగా ఉంటాయని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే వాటిని లైవ్ ఫొటోలు, లైవ్ వీడియోలు తీసి సీ – విజిల్ యాప్ ద్వారా పంపాలని తెలిపారు. ప్రజలు, ఓటర్లు సీ– విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జీపీఎస్ ఆన్లో ఉంచాలని… జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిక్గా లోకేషన్ నమోదవుతుందని సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినా, ఇతర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫొటోలు, వీడియోలు సీ – విజిల్ యాప్ ద్వారా పంపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలోని యువత సీ– -విజిల్ యాప్ను ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లంఘన లను తమ దృష్టికి తీసుకుని రావాలని, 24 గంటలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం నుండి సీ– -విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. సి-విజిల్ యాప్ను తమ ఫోన్లలో ప్లే-స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సీ– -విజిల్ యాప్ ద్వారా 243కేసులు నమోదు కాగా వాటిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.