ముగించు

జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అధికారులందరూ సంసిద్దంగా ఉండాలి, ఓటరు స్లిప్పులు పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు తప్పకుండా నిర్వహించాలి, ఆర్వోలు, ఏఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

18/11/2023 - 05/12/2023

Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                                       తేదీ : 17–11–2023
=========================================
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అధికారులందరూ సంసిద్దంగా ఉండాలి,
ఓటరు స్లిప్పులు పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు తప్పకుండా నిర్వహించాలి,
ఆర్వోలు, ఏఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, సిబ్బంది సంసిద్దంగా ఉండాలని ఈ విషయంలో ఎప్పటికప్పుడు వారికి అప్పగించిన విధులు నిర్వహించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియతో కలిసి జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు)లతో ఓటరు స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు, వెబ్క్యాస్టింగ్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ  ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని, ఇంటింటికీ వెళ్ళి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని దీంతో పాటు పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు స్లిప్పుల ముద్రణ చేసి వాటి పంపిణీ పకడ్బందిగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ అంశంలో ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ను రాజకీయ పార్టీలప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలని, వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలను సైతం  ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి 6,449 మంది ఉన్నారని… పోస్టల్ బ్యాలెట్ వినియగుచుకొందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం రూట్మ్యాప్ తయారు చేసుకొని ముందుస్తుగా వారికి ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి, పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించామని అందుకు తగినట్లుగా వారు ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటవెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో స్ట్రాంగ్రూమ్, పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాల వివరాలను పూర్తి సమాచారంతో తెలిసి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, దీనికి అవసరమైన మేరకు యంత్రాంగం సిద్దం చేసుకోవాలని, స్థానికంగా అందుబాటులో ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలని ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.