జిల్లాలో ఎన్నికలకు అధికారులందరూ సిద్దంగా ఉండేలా చర్యలు, జిల్లా నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
పత్రిక ప్రకటన–1 తేదీ : 18–11–2023
=========================================
జిల్లాలో ఎన్నికలకు అధికారులందరూ సిద్దంగా ఉండేలా చర్యలు,
జిల్లా నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని… ఈ విషయంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్చాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు ప్రణాళికతో పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియతో కలిసి జిల్లాలోని నోడల్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ మోడకల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఎన్నికల్లో అక్రమంగా నగదు పంపిణీ, మద్యం, డ్రగ్స్ వంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరగుకుండా ఎస్ ఎస్ టీ, ఎఫ్ ఎస్ టీ బృందాలు ఇప్పటి వరకు చేసిన కేసులు, పనులకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే జిల్లాలో వ్యయపరిశీలకుల బృందంలో తీసుకున్న చర్యలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. సీ–విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 229 ఫిర్యాదులు రాగా వాటికి సంబంధించి సమస్యలు పరిష్కరించినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2050కి వచ్చిన ఫిర్యాదులు, ఫోన్ కాల్స్పై పూర్తి సమాచారాన్ని సేకరించారు. స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఓటర్ల అవగాహన, ఓటు ప్రాముఖ్యత తదితర వివరాలు చేపడుతున్నట్లు అధికారులు వివరించగా మరింత అవగాహన కల్పించాల్సిందిగా వారికి సూచించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఇంటింటికీ వెళ్ళి ఇప్పటి వరకు సేకరించిన వివరాలు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ చర్చించి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. దీంతో పాటుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్కు 2,419 కాల్స్ వచ్చినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. దీనిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారి ద్వారా పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా చెక్పోస్టుల వద్ద ఉండే అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు, అవసరమైన పోలింగ్ సిబ్బంది ఉన్నారా ? తదితర వివరాలను తెలుసుకొన్నారు. ఎన్నికల రోజున వెబ్క్యాస్టింగ్ చేయడానికి అందులో అవగాహనవున్నా సిబ్బందిని నియమించుకొనేలా ఇప్పటి నుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఫారం 12 డి క్రింద 80 సంవత్సరాలు పైబడ్డ, పి డబ్ల్యూ డి ఓటర్లకు ఇంటి వద్ద నుండే ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో ముందుగా ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఇంటి వద్ద నుండే ఓటు వేసే సందర్భంలో అన్ని పార్టీల నాయకులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎన్నికల విధులలో పాల్గోనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారిఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో శాసనసభ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఈ విషయంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం నోడల్ అధికారులు కొన్ని అంశాలను సమావేశంలో ప్రస్తావించగా అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.