ముగించు

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, జిల్లా వ్యాప్తంగా వందశాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటు వేయడానికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు ఐఏఎస్.,

29/11/2023 - 07/12/2023

Medchal-Malkajgiri

పత్రిక ప్రకటన–1                   తేదీ : 28–11–2023
=================================
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు,
జిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి,
ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ ,
 , మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ  ఈ నెల 30 న జరిగే పోలింగ్ లో పాల్గొని  తొలి ఓటు అనుభూతి పొందాలని అన్నారు.  ప్రజాస్వామ్య భారత దేశంలో  అన్ని దేశలకంటే యువత ఎక్కువగా ఉన్నారని, రాజకీయ నిర్ణయాధికారం యువతదేనని,  చైతన్యవంతులై  వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు.
 ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోటోతో ఉన్న ఓటరు కార్డ్ లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డ్ లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని  అన్నారు.  ఓటర్ ఎపిక్ కార్డు, . ఆధార్ కార్డు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డ్ ,బ్యాంక్ /పోస్ట్ఆఫీస్ ( ఫోటో తో ఉన్నవి) పాస్ బుక్ లు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్,  పాన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్ కార్డ్, భారత పాస్ పోర్ట్, పోటో తో ఉన్న పించన్ పత్రం,ఉద్యోగులకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం /ప్రభుత్వ సంస్థలు /పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లు జారీ చేసిన పోటో గుర్తిoపు  కార్డ్ , దివ్యంగుల గుర్తిoపు కార్డ్,  చట్ట సభల లో సభ్యత్వన్ని చూపే అధికారిక గుర్తిoపు కార్డ్ లలో ఎదో ఒక  గుర్తింపు కార్డ్  ను తీసుకొని పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు వేయాలన్నారు.
జిల్లాలోని మొత్తం ఓటర్లు;
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పై వివరిస్తూ జిల్లాలోని మొత్తం ఓటర్లు(28,19,067) 28 లక్షల 19వేల 067 మంది వారిలో పురుషులు(14,59,629) 14లక్షల 59 వేల 629 మరియు స్త్రీలు (13,59,057) 13 లక్షల 59వేల 057 మంది థర్డ్ జెండర్ 381 మంది అని తెలిపినారు జిల్లా వ్యాప్తంగా 841 లొకేషన్స్ లో పోలింగ్ స్టేషన్స్ 2439 ఉండగా వీటిలో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ 2280 రూరల్ పోలీస్ స్టేషన్ 159 ఉన్నాయని తెలిపినారు .,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా, జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకం, 16 విభాగాలకు నోడల్ అధికారులు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పదహారు విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల బరిలో 126 మంది అభ్యర్థులు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపినారు .
జిల్లాలోని పోలింగ్ మహిళా,  దివ్యాంగులు, మోడల్ పోలింగ్, యూత్  పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలో 2439 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది.. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మహిళా పోలింగ్ స్టేషన్ల చొప్పున ఐదు నియోజకవర్గాలలో 25 మహిళా పోలింగ్ స్టేషన్లు ఉంటాయని… అందులోని  పోలింగ్ కేంద్రాలలో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బంది ఉండి ఎన్నికల విధులు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులుకు ఒకటి చొప్పున ఐదు నియోజకవర్గాలకు ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని… అందులోని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా దివ్యాంగులు ఎన్నికల విధులను నిర్వహిస్తారని… అదే విధంగా యువత కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని… వాటిల్లో సైతం పూర్తిగా యువకులైన ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.  జిల్లాలో మోడల్ పోలింగ్ స్టేషన్ ప్రతి నియోజక వర్గంలో ఐదు చొప్పున 25   పోలింగ్ కేంద్రాలు ఎర్పాటు చేశామని… ఆ పోలింగ్ కేంద్రాల్లో అందంగా… ఆకర్షణీయంగా అలంకరించి ఉండేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.  జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మహిళలు, దివ్యాంగులు,  యువత ఓటు హక్కు తమ బాధ్యతగా భావించి ఓటు వేయాలని… వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
జిల్లాలోని పోలింగ్ మహిళా,  దివ్యాంగులు, మోడల్ పోలింగ్, యూత్ మేనేజ్డ్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వివరాలిలా ఉన్నాయి. + మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మహిళా పోలింగ్ కేంద్రం నెంబర్  –  49, 125,350, 360, 459, దివ్యాంగులకు సంబంధించి పోలింగ్ కేంద్రం నెంబర్ – 560, మోడల్ పోలింగ్ కేంద్రం నెంబర్  – 67, 137, 260, 296, 435, యూత్  పోలింగ్ కేంద్రం నెంబర్  – 222 .

+ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మహిళా  పోలింగ్ కేంద్రం నెంబర్ –  07, 30, 143, 226, 269,  దివ్యాంగులకు సంబంధించి పోలింగ్ కేంద్రం నెంబర్ – 280, మోడల్ పోలింగ్ కేంద్రాలు – 28,55, 77, 235, 243, యూత్  పోలింగ్ కేంద్రం నెంబర్ – 388.
+ కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మహిళా పోలింగ్ కేంద్రం నెంబర్ – 56, 182, 280, 310, 409,  దివ్యాంగులకు సంబంధించి పోలింగ్ కేంద్రం నెంబర్ – 515, మోడల్ పోలింగ్ కేంద్రం నెంబర్ – 36, 144, 305, 398, 437,  యూత్  పోలింగ్ కేంద్రం నెంబర్ – 173.
+ కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మహిళా మేనేజ్డ్ పోలింగ్ కేంద్రం నెంబర్ –  14, 39, 70, 353, 358,  దివ్యాంగులకు సంబంధించి పోలింగ్ కేంద్రం నెంబర్  – 218,  మోడల్ పోలింగ్ కేంద్రం నెంబర్ – 13, 173, 271, 352, 407,  యూత్ మేనేజ్డ్ పోలింగ్ కేంద్రం నెంబర్  – 328.
+ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మహిళా  పోలింగ్ కేంద్రం నెంబర్ –  40, 137, 193, 238, 361,  దివ్యాంగులకు సంబంధించి పోలింగ్ కేంద్రం నెంబర్  – 391,  మోడల్ పోలింగ్ కేంద్రం నెంబర్ – 68, 135, 234, 291, 362, యూత్  పోలింగ్ కేంద్రం నెంబర్ – 210. ఉన్నాయని తెలిపినారు .,
అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించనైనదని, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు   అంగవైకల్యం,  అందులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని అలాగే  బ్రెయిలీ  లిపి లో ఉన్న నమూనా బ్యాలెట్ పై ఓటు వినియోగం పై  అంధులు, ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని అలాగే వృద్ధులు, అందులకు ఇప్పటికే గుర్తించిన కేంద్రాలలో  వీల్ ఛైర్స్ ఏర్పాటు చేసామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,  వివరించారు
జిల్లావ్యాప్తంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో  బ్యాలెట్ యూనిట్లు,6422  కంట్రోల్ యూనిట్లు,3050 వివి ప్యాట్లు,3373 వినియోగిస్తున్నామన్నారు.
పోలింగ్ సిబ్బంది  12510,
మొత్తం 2439  పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది  12510, అందులో 2880 మంది పీవోలు, 2860  మంది ఏపీవో లు, 6570 మంది ఓపీవోలు ఉన్నారని తెలిపారు. మైక్రో అబ్జర్వర్ లు 200 మంది ఎన్నికల విధులను నిర్వహించడానికి సిద్దము గా వున్నారు అని తెలిపినారు .
హోం ఓటింగ్;;
హోం ఓటింగ్ 1007 మంది ఓటింగ్ చేశారన్నారు.80 సంవత్సరాల పైబడిన వారు 668 మంది పిడబ్ల్యుడి ఓటర్స్ 339, మంది ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ల ;
  ఎన్నికలవిధులు నిర్వహిస్తున్న  సిబ్బంది  వివిధ కారణాలతో తమ ఓటును వినియోగించు కోలేని  సిబ్బంది కి  ఓటు వేసు కునే  అవకాశం  పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవచ్చని  జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్  గౌతమ్ తెలిపారు పోలింగ్ ఆఫీసర్స్,ఓపిఒ లు , పోలింగ్ ఆఫీసర్ లు    పోలీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినుయోగించుకున్నారని కలెక్టర్  తెలిపారు. ఫెసిలిటిషన్ సెంటర్స్ లో తమ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నారని పోలీస్ సిబ్బంది కూడా తమ ఓటు హక్కు ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారని సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా ఉద్యోగస్తులు వినియోగించుకున్నారని తెలిపినారు.పోస్టల్ బ్యాలెట్లు 2018 లో 3154 తీసుకొనగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు   6368 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగిచుకొన్నారు అని తెలిపినారు .
జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఏర్పాటు చేసిన 2439 పోలింగ్ స్టేషన్లలో అన్ని పోలింగ్ కేంద్రాలలో  వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్  135 వున్నాయి అని వీటి లింకును రిటర్నింగ్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలకు కు అనుసంధానం చేశారు. 369, రూట్స్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు.
ఎపిక్ కార్డ్స్,, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్,,
ఎపిక్ కార్డ్స్3,72,758 కార్డ్స్ ఇప్పటి వరకు పంపిణి చేసాము అని అలాగే  ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ 90 శాతం పంపిణి జారింది అని తెలిపినారు.
ఎఫ్ ఎస్ టి  ఎస్ ఎస్ టి , పోలీస్ టీమ్స్ తనిఖీలలో ఇప్పటి వరకు జప్తు చేసిన వాటి వివరములు,
ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు జిల్లా లో తనిఖీలలో ఇప్పటి వరకు జప్తు చేసిన (నగదు ,ఆభరణాలు, బంగారం మొత్తము విలువ  )  60, కోట్లు 82 లక్షల 93 వేల 018 రూపాయల్లో, నగదు : 36,13,52,308, బంగారం, వెండి మిగతా ఇతరత్ర విలువైన వస్తవులు : 24,69,40,710,  స్వాధీనం చేసుకొని అలాగే ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఆధ్వర్యంలో రెండు లక్షల పది హేడు వేల డెబై మూడు (2,29,214)   లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 1,292 కేసులు నమోదు 598 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని… ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, పోలీస్ టీమ్స్ రానున్న  48 గంటల పరిధి లో ఇంకా టీమ్స్ అవసమైన మేరకు పెంచుతాము  అని .మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
పట్టుకున్న నగదు తీసుకునేందుకు గ్రీవెన్స్ కమిటీ,
 ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనల ప్రకారం ఎవరూ కూడా రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేయొద్దని,అన్నారు.. జిల్లాలో పోలీసులు ఎఫ్ఎఎస్టీ బృందాలు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లాస్థాయి గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ f-12 లో గ్రీవెన్స్ కమిటీ పరిశీలి స్తుందని, తెలిపారు.
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్
జిల్లా కలెక్టరేట్లో  గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న  జీ–-36 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ జిల్లాలోని  ద్వారా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
18 నుండి 19 సంవత్సరాల ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువకులు సంఖ్య 59,213 ,
.ఓటింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో లైన్ తెలుసుకోవడానికి  క్యూ లైన్ తెలుసుకొనుటకు యాప్ తయారు ద్వారా తెలుసుకోవచ్చును అదే విధంగా  పోలింగ్ కేంద్రం తెలుసుకొనుటకు గూగుల్ మ్యాప్ లో చూసుకోవచ్చు నన్నారు. ఎపిక్ కార్డు ఉంటే సరి పొదని ఓటరు జాబితాలో పేరు ఉంటేనే  ఓటు హక్కు వినియోగించుకోనే అవకాశం ఉందన్నారు అందుకు ఓటరు జాబితాలో పేరు ఉందో  లేదో సరి చూసుకోవాలన్నారు.అందుకుక్ ఓటరు హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోసి సరుచూసు కావాలన్నారు.
సీ– విజిల్ యాప్,
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా రూపొందించిన సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సీ– విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులో ఫిర్యాదుదారు ఫోన్ నెంబర్, వివరాలు లేకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు సీ– -విజిల్ యాప్ ద్వారా 430 కేసులు నమోదు కాగా వాటిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2050
 జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఇరవై నాలుగు గంటలు పని చేసే విధంగా ప్రత్యేకంగా టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల సౌకర్యార్థం ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2050 కు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఓటర్ హెల్ప్లైన్ ఆప్,  ECI వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ 1950, c-VIGIL యాప్, సాక్ష్యం యాప్ ల యొక్క ఉపయోగాలను వివరించారు.  పోలింగ్ రోజున వికలాంగులు,  సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. పంపిణీ చేసిన ఓటరు స్లిప్ లు, ఓటర్ గైడ్ బుక్లెట్ల ఉపయోగాలగల గురించి వివరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడం కోసం పోలింగ్ కు పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల పేరు ఉందో లేదో సరి చూసు కావాలని అన్నారు.
 ఓటర్ హెల్ప్లైన్ APP, ECI వెబ్సైట్, voters.eci.gov.in  టోల్ ఫ్రీ నంబర్ 1950ని ఉపయోగించి మీ పోలింగ్ స్టేషన్  పరిశీలించు కోవాలని తెలిపారు.