ముగించు

జిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి, ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

09/11/2023 - 30/11/2023
Medchal-Malkajgiri

జిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి,
ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని వంద శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఓటర్లందరు నిష్పక్షపాతoగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమని,18 సంవత్సరాల నిండి కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లందరూ పోలింగ్ రోజు ఏక్కడికి వెళ్లకుండా బాధ్యతగా
తమ ఓటు హక్కును వినియోగించుకొని సత్తా చాటాలన్నారు. నూతన యువ ఓటర్లు ప్రజాస్వామ్యా నికి పునాది అని ,ఈ నెల 30 న జరిగే పోలింగ్ లో పాల్గొని తొలి ఓటు అనుభూతి పొందాలని అన్నారు. ప్రజాస్వామ్య భారత దేశంలో అన్ని దేశలకంటే యువత ఎక్కువగా ఉన్నారని, రాజకీయ నిర్ణయాధికారం యువతదేనని, చైతన్యవంతులై వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటర్లను మభ్యపెడ్తూ డబ్బు ,మద్యం ,ఏదైనా వస్తువుల పంపిణీ జరిగితే, సి- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుదుతామన్నారు. ఓటరు జాబితా లో ఉన్నఓటర్లందరికి ఓటరు స్లిప్పులు పంపిణి చేస్తామని, నేను కచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోటోతో ఉన్న ఓటరు కార్డ్ లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డ్ లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని అన్నారు. ఓటర్ ఎపిక్ కార్డు, . ఆధార్ కార్డు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డ్ ,బ్యాంక్ /పోస్ట్ఆఫీస్ ( ఫోటో తో ఉన్నవి) పాస్ బుక్ లు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్ కార్డ్, భారత పాస్ పోర్ట్, పోటో తో ఉన్న పించన్ పత్రం,ఉద్యోగులకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం /ప్రభుత్వ సంస్థలు /పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లు జారీ చేసిన పోటో గుర్తిoపు కార్డ్ , దివ్యంగుల గుర్తిoపు కార్డ్, చట్ట సభల లో సభ్యత్వన్ని చూపే అధికారిక గుర్తిoపు కార్డ్ లలో ఎదో ఒక గుర్తింపు కార్డ్ ను తీసుకొని పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు వేయాలన్నారు.