ముగించు

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేలా చర్యలు, జిల్లా ఎన్నికల పరిశీలకులు పూర్వాగార్గ్, అమన్ మిట్టల్తో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టరేట్లో ఎంసీఎంసీ, సీ–విజిల్, 1950, గ్రీవెన్స్ సెల్ , పని తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎన్నికల పరిశీలకులు

21/11/2023 - 30/11/2023
Medchal-Malkajgiri District.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేలా చర్యలు,
జిల్లా ఎన్నికల పరిశీలకులు పూర్వాగార్గ్, అమన్ మిట్టల్తో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
జిల్లా కలెక్టరేట్లో ఎంసీఎంసీ, సీ–విజిల్, 1950, గ్రీవెన్స్ సెల్ , పని తీరు  పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎన్నికల పరిశీలకులు,
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఐదు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేలా అవసరమైన చర్యలను ముందస్తుగానే చేపడుతున్నామని ఈ విషయంలో అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్కు వచ్చిన జిల్లా ఎన్నికల పరిశీలకులు పూర్వాగార్గ్, అమన్మిట్టల్తో కలెక్టర్ గౌతమ్ తన ఛాంబర్లో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతవరణంలో జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టామని ఈ విషయంలో అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్దం చేసి అందుకు అనుగుణంగా తమ విధులు నిర్వహిస్తున్నారని అందుకు సంబంధించిన చేపట్టిన వివరాలను అధికారులకు తెలిపారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు పూర్వాగార్గ్, అమన్ మిట్టల్లు జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్  కమిటీ (ఎంసీఎంసీ) కేంద్రాన్ని పరిశీలించారు ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా నిర్వహణలో భాగంగా ఎన్నికల సంబంధిత సమాచారం, ఎం సి ఎం సి ద్వారా ఎన్నికలలో ప్రకటనలు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్  కమిటీ సర్టిఫికేషన్, ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయడం, రోజు వారి నివేదికల నిర్వహణ, పెయిడ్ న్యూస్ కేసుల వివరాలు  సోషల్ మీడియాపై పర్యవేక్షణ చేయడం వాటి గురించి వివరము గా అడిగి తెలుసుకొన్నారు. కంట్రోల్ రూంను సందర్శించారు. 1950 టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరును గమనించారు. చెక్ పోస్ట్ ల వద్ద ఎస్.ఎస్.టీ బృందాల పని తీరును, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును కంట్రోల్ రూంలో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. దీంతో పాటు  సీ–విజిల్,  గ్రీవెన్స్ సెల్, టోల్ ఫ్రీ నెంబర్లకు వచ్చిన ఫిర్యాదులు… తీసుకున్న చర్యలను తెలుసుకొని అధికారులు, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

1111a q2