యువత మరియు క్రీడా విభాగం
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఈ క్రింది విధులు నిర్వర్తించును.
- యువత కి ఉపాధి కల్పించడానికి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ని, దేవరయంజాల్, తూముకుంట లో ప్రారంబించడానికి సన్నాహాలు జరుగుతున్నవి .
- తెలంగాణ రాష్త్ర క్రీడల పాఠశాల, హకీమ్ పేట్ లో 4 వ తరగతి ప్రవేశం కొరకు మండల స్థాయి లో మరియు జిల్లా స్థాయి లో ఎంపికలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది .
- స్వాతంత్ర దినోత్సవ మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలలో, భాగంగా కార్యాలయ సిబ్బంది కి ఆటలు ఆడిపించడం జరుగుతుంది . గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరుగుతుంది.
- యువత కు ప్రభుత్వం యువ చేతన అనే కార్యక్రమము ద్వారా యువత ని సంఘాలు గా ఏర్పడి వారికీ ఉపాధి అందించడానికి పునాది వేస్తుంది.
- వేసవి శిక్షణ శిబిరాల ను ప్రతి సంవత్సరం మే నెల లో PET ల సమక్షణం లో నిర్వహించడం జరుగుతుంది.
- ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
- జాతీయ యువజన దినోత్సవం (జనవరి 12), ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ( ఆగస్ట్ 6), జాతీయ క్రీడల దినోత్సవం (ఆగస్ట్ 29), శ్రీ కాళోజీ రావు జయంతి (సెప్టెంబర్ 9), గాంధీ జయంతి (అక్టోబర్ 2) మరియు జాతీయ ఐక్యత దినోత్సవం (అక్టోబర్ 31) వేడుకలని నిర్వహించడం జరుగుతుంది.
క్రీడా మైధానాలు- మేడ్చల్ మల్కాజి గిరి
- శామీర్ పేట్ మినీ స్టేడియం లో ప్రహరీ గోడ నిర్మాణ పనులు, రాళ్ళను మరియు ఇతర పొదలను తొలగించడం జరిగింది.
- మేడ్చల్ మినీ స్టేడియం నిర్మాణ పనులు ( మెట్లు నిర్మాణం, మైధానం సమానం చేయడం, పొదలను తొలగించడం, మురికి నీటిని తొలగించడం వంటి పనులు) జరుగుతున్నవి.
- జ్యోతి రావు ఫూలే స్టేడియం, గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్ లో నిర్మాణ పనులు కొనసాగుతున్నవి.
ఇతర మైదాన స్థలాల కొరకు గాను ఘట్కేసర్ లో, కూకట్పల్లి మరియు జవహర్ నగర్ లో మైదాన స్థలాల కొరకు సంబందిత తాసీల్దార్ లకు లేఖ లు రాయడం జరిగింది.