ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి, జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులతో సమన్వయ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు,
పత్రిక ప్రకటన–1 తేదీ : 14–11–2023
=========================================
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి,
జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులతో సమన్వయ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జిల్లాలోని ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వా గార్గ్, అమన్మిట్టల్, వ్యయ పరిశీలకులు ప్రేమ్ప్రకాశ్ మీనా, నాగే బాలాసాహెబ్ బాపూరావు, జిల్లా పోలీస్ అబ్జర్వర్ నేహా యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సాధారణ ఎన్నికలు 2023 నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు , సభలు అనుమతులకు ఇతర కార్యకలాపాల కోసం వచ్చే దరఖాస్తులను ఎన్నికల నియమాలు లోబడి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు.సువిధ యాప్ ద్వారా ఎన్నికల ప్రచార సభలకు, సమావేశాలకు సువిధ లో లాగిన్ అయితే నిబంధన లోబడి వెంటనే అనుమతులు మంజూరు వస్తుందని తెలిపారు . . సువిధ యాప్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిబంధనలకు లోబడి ఉన్న వాటికి నిర్ణీత గడువులోపు అనుమతులు జారీ చేసేలా చొరవ చూపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు దాటకూడదని అన్ని రకాల రిజిస్ట్రర్లు తప్పకుండా మెయింటెన్ చేయాలని ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీకి కానీ, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమను నేరుగా సంప్రదించాలని తెలిపారు. అలాగే ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు సమావేశంలో అబ్జర్వర్ల దృష్టికి తీసుకురాగా ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా నోట్ చేసుకొన్నారు. ఈ మేరకు వారు సమావేశంలో తెలియజేసిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఎన్నికల అధికారులు, జిల్లాలోని గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పరిశీలకులు, వ్యయపరిశీలకులు, జిల్లా పోలీస్ అబ్జర్వర్, అధికారుల వివరాలిలా ఉన్నాయి…
==============================================
అసెంబ్లీ నియోజకవర్గం అబ్జర్వర్ పేరు ఫోన్‌నెంబర్
================================================
మేడ్చల్, ఎస్.కె.జైన్ 73370-47775 మల్కాజిగిరి, ఉప్పల్ పూర్వా గార్గ్ 73370-47776
కుత్భుల్లాపూర్, కూకట్పల్లి అమన్మిట్టల్ 73370-47778
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
అసెంబ్లీ నియోజకవర్గం వ్యయపరిశీలకుల పేరు ఫోన్ నెంబర్
================================================
మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ ప్రేమ్ప్రకాశ్ మీనా 73370-47773
కుత్భుల్లాపూర్, కూకట్పల్లి నాగే బాలాసాహెబ్ బాపూరావు, 73330-47774
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
జిల్లా పోలీస్ అబ్జర్వర్ వివరాలు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
జిల్లా పోలీస్ అబ్జర్వర్ నేహా యాదవ్ 7337209990
+ కలెక్టరేట్లోని ఎఫ్–26లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అందుబాటులో ఉంటారు.
================================================
ఎన్నికల పరిశీలకులను కలిసేందుకు వివరాలు, సమయాలు ;-
ఎస్.కె.జైన్, మేడ్చల్, పరిశీలకులను మేడ్చల్ రిటర్నింగ్ ఆఫీసులో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నేరుగా కలవవచ్చని తెలిపారు. అలాగే ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు సంబంధించి పూర్వా గార్గ్ అబ్జర్వర్‌ను జిల్లా కలెక్టరేట్లోని మొదటి అంతస్తులో ఎఫ్– 26 లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యన నేరుగా కలవడానికి అవకాశం ఉంటుంది. కుత్భుల్లాపూర్, కూకట్పల్లి ఎన్నికల , అమన్మిట్టల్ పరిశీలకులను ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్, ప్రగతినగర్‌లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యన నేరుగా కలువవచ్చని తెలిపారు.
అలాగే వ్యయ పరిశీలకులు ప్రేమ్ ప్రకాశ్ మీనా కలెక్టరేట్లోని మొదటి అంతస్తులోని ఎఫ్–26లో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నేరుగా కలుస్తారని, బాలాసాహెబ్ బాపూరావు ఇండియన్ నేషన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్, ప్రగతి నగర్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నేరుగా కలిసేందుకు వీలుంటుంది అని తెలిపినారు.